టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన “హిట్: ది థర్డ్ కేస్” (హిట్ 3) మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో సంచలనాలు నమోదు చేస్తోంది. మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ఆదరణ పొందింది.దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం, “హిట్” సిరీస్‌లో మూడవ భాగం. ఇందులో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ SP అర్జున్ సర్కార్ పాత్రలో నటించగా, హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. థ్రిల్లింగ్ కథ, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ వివరాలు:
- మొదటి రోజు (మే 1):
- వరల్డ్‌వైడ్ గ్రాస్: ₹43 కోట్లు
- ఇండియాలో నెట్ కలెక్షన్: ₹19 కోట్లు
- అమెరికాలో కలెక్షన్: $1.1 మిలియన్ (దాదాపు ₹9.1 కోట్లు)
ఈ భారీ వసూళ్లు చూసి సినిమా ట్రేడ్ విశ్లేషకులు, “హిట్ 3” మంచి లాభాలను అందించడంతో పాటు, నాని కెరీర్‌లో మరొక బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.