డిజిలోకర్ (DigiLocker)
ఉద్దేశ్యం: వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిటల్‌గా భద్రపరచడం మరియు అవసరమైనప్పుడు సురక్షితంగా షేర్ చేయడం.
ప్రధాన లక్షణాలు:
- ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యాసంబంధిత ధ్రువపత్రాలు డిజిటల్‌గా భద్రపరచవచ్చు
- 1 GB వరకు ఉచిత స్టోరేజ్
- ప్రభుత్వ, విద్యా సంస్థల నుండి నేరుగా డాక్యుమెంట్లు పొందే అవకాశం
- e-Sign ద్వారా డాక్యుమెంట్లను అధికారికంగా పంచుకునే వీలుంది
వెబ్సైట్: www.digilocker.gov.in
యాప్: Android | iOS
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ (RBI Retail Direct)
ఉద్దేశ్యం: సాధారణ పౌరులు నేరుగా ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు.
ప్రధాన లక్షణాలు:
- వ్యక్తిగత ఖాతాదారుల కోసం RDG (Retail Direct Gilt) ఖాతా
- ట్రెజరీ బిల్లు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో డైరెక్ట్‌గా పెట్టుబడి
- RBI ప్లాట్‌ఫాంలో ఖాతా నిర్వహణ పూర్తి ఉచితం
వెబ్సైట్: www.rbiretaildirect.org.in
యాప్: Android | iOS
AIS for Taxpayers
ఉద్దేశ్యం: పన్ను చెల్లింపుదారులకు వారి సంవత్సరిక సమాచారాన్ని ఒకేచోట అందించడం.
ప్రధాన లక్షణాలు:
- ఆదాయ వివరాలు, బ్యాంక్ లావాదేవీలు, TDS సమాచారాన్ని చూపిస్తుంది
- అప్రమత్తతలు, ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేసే అవకాశం
- ఐటీఆర్ ఫైలింగ్‌కు ఉపయోగపడే సమగ్ర సమాచారం
యాప్: Android | iOS
mParivahan
ఉద్దేశ్యం: ఈ యాప్‌తో మీరు వాహనానికి సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఛలాన్ లాంటి సేవలను ఫోన్లో చూసుకోవచ్చు.
ప్రధాన లక్షణాలు:
- వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్, RCను స్టోర్ చేసుకోవచ్చు
- వాహన వివరాలు, ఛలాన్లు చెక్ చేయవచ్చు
- ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మాలిక్ మార్పు వంటి సేవలకు అప్లై చేయవచ్చు
యాప్: Android | iOS
డిజీ యాత్ర (Digi Yatra)
ఉద్దేశ్యం: facial recognition ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లో paperless check-in సౌకర్యం.
ప్రధాన లక్షణాలు:
- ఐడి కార్డు, బోర్డింగ్ పాస్ అవసరం లేకుండా facial scan ద్వారా ఎంట్రీ
- 24 గంటల్లో ప్రయాణ సమాచారాన్ని delete చేయడం ద్వారా గోప్యతకు అధిక ప్రాధాన్యత
- ప్రస్తుతం 28 ఎయిర్‌పోర్ట్‌లలో అందుబాటులో ఉంది
యాప్: Android | iOS