పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలను కూడా గౌరవించిన గద్దర్ అవార్డులు: జయసుధ
గద్దర్ ఫిల్మ్ అవార్డులపై జ్యూరీ చైర్పర్సన్ జయసుధ స్పందించారు. ఈ అవార్డులు పెద్ద సినిమాలకే కాకుండా, చిన్న సినిమాలు, కొత్త దర్శకులు చేసిన సినిమాలకు కూడా గుర్తింపు ఇచ్చాయన్నారు.
జయసుధ మాట్లాడుతూ, “ఈసారి వచ్చిన చిన్న సినిమాల్లో మంచి కథలు కనిపించాయి. కొత్త దర్శకులు ఎంతో కష్టపడి మంచి సినిమాలు తీశారు. వాళ్లకు ఈ అవార్డులు బహుమతి లాంటి గుర్తింపుగా మారాయి” అని చెప్పారు.
ప్రభుత్వం నుంచి పూర్తి స్వేచ్ఛ లభించిందని, అందుకే అవార్డుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగిందని తెలిపారు. “జ్యూరీ సభ్యులు అందరూ నిజాయితీగా పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు” అని జయసుధ అన్నారు.
“చిన్న చిత్రాలకు ఇలాగే గుర్తింపు వస్తే, కొత్త టాలెంట్‌కి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. గద్దర్ అవార్డులు భవిష్యత్‌లో ఇంకా గొప్ప కళాకారులను వెలికితీస్తాయి” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.