ఎన్టీఆర్ అవార్డు రావడం నా అదృష్టం – బాలకృష్ణ
తెలుగు ప్రముఖ నటుడు బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించింది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకు రావడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని చెప్పారు.
బాలయ్య మాట్లాడుతూ, “ఇది నా అదృష్టం. దేవుడి ఆశీర్వాదం, నాన్న ఎన్టీఆర్ ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. ఈ అవార్డు నాకు రావడం వెనుక ఆ ఆశీర్వాదాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు” అని చెప్పారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం తన జీవితంలో చాలా ప్రత్యేకమైన ఘట్టంగా మారిందని అన్నారు.
ఈ సంవత్సరం తన నట జీవితం 50 ఏళ్లు పూర్తయ్యిందని, అదే సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ నట జీవితానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భం కావడం కూడా విశేషమన్నారు.
“తెలుగు ప్రజల ప్రేమ, నాన్న ఆశీర్వాదం ఎప్పటికీ నాతో ఉండాలని ఆశిస్తున్నాను” అని బాలకృష్ణ చెప్పారు.