Home » Telugu Movie » అమర్ దీప్ – సుప్రీత జంటగా రాబోతున్న ఫ్రెష్ లవ్ స్టోరీ! “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి”.
అమర్ దీప్ – సుప్రీత జంటగా రాబోతున్న ఫ్రెష్ లవ్ స్టోరీ! “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి”.
తెలుగు బుల్లితెర నటుడు అమర్ దీప్ మరియు నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు కలిసి నటిస్తున్న కొత్త సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉంది – “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి”.
ఈ సినిమాకు మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల పర్యవేక్షణలో, మహా మూవీస్ మరియు ఎమ్3 మీడియా నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేయగా, అందరి నుండి మంచి స్పందన వచ్చింది.
నటి సుప్రీతా మాట్లాడుతూ – “ఇది నా మొదటి సినిమా. మొదట భయం వేసినా, ఇప్పుడు చాలా నమ్మకం వచ్చింది. మా డైరెక్టర్, హీరో అమర్ నాకు చాలా సహాయం చేశారు. నిర్మాత గారు నన్ను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. గ్లింప్స్ చాలా బాగా వచ్చాయి” అని చెప్పారు.
హీరో అమర్ దీప్ మాట్లాడుతూ – “ఈ సినిమా నా మొదటి సినిమా. టైటిల్ వినగానే చాలా ఇష్టం వచ్చింది. బిగ్ బాస్ తరువాత మంచి సినిమా తీసుకురావాలని అనుకున్నాం. మా నిర్మాత చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా అందరికీ నచ్చేలా తీశాం” అని చెప్పారు.
సురేఖ వాణి కూడా మాట్లాడుతూ – “టైటిల్ బాగుంది. సినిమా హిట్ అవ్వాలి అనుకుంటున్నాను” అని ఆశాభావం వ్యక్తం చేశారు.