Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   కాపు మహిళల కోసం ‘గృహిణి’ పథకం – ఒక్కసారిగా ₹15,000 ఆర్థిక సహాయం

కాపు మహిళల కోసం ‘గృహిణి’ పథకం – ఒక్కసారిగా ₹15,000 ఆర్థిక సహాయం

కాపు మహిళలకు ఆర్థికంగా సహాయపడేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకానికి “గృహిణి” అనే పేరు పెట్టారు. ఈ పథకం ద్వారా ఒక్కసారి (వన్‌టైం) ₹15,000 చొప్పున సహాయం ఇవ్వాలని కాపు సంక్షేమ కార్పొరేషన్ ప్రతిపాదించింది.

ఈ విషయం గురించి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. “ఈ పథకం అమలు కోసం మొత్తం ₹400 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశాం. “ఈ డబ్బు గృహిణులకు కొంత ఆర్థిక సహాయం అవుతుంది,” అని ఆయన అన్నారు.

బుధవారం తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుబ్బారాయుడు ఈ వివరాలను తెలియజేశారు.

అలాగే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపు వర్గ అభివృద్ధికి ఇప్పటికే ₹4,600 కోట్లు కేటాయించిందని, ఈ సాయంతో కాపు కుటుంబాల జీవన ప్రమాణం మెరుగవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Get In Touch

© APTG360. All Rights Reserved.