Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Political Voice   »   వరుడి చేతులు వణకడం తో పెళ్లి రోజు వధువు పెళ్లికి నిరాకరణ<వీడియో>

వరుడి చేతులు వణకడం తో పెళ్లి రోజు వధువు పెళ్లికి నిరాకరణ<వీడియో>

బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అనుకోని పరిస్థితి తలెత్తింది. పెళ్లి తంతు సజావుగా కొనసాగుతోంది. ఆచారాలు, రీత్యా అన్నీ పూర్తయ్యాయి. చివర్లో వరుడు వధువు నుదుట సిందూరం పెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ క్షణంలో వరుడి చేయి వణికింది.

ఈ దృశ్యాన్ని చూసిన వధువు షాక్ అయ్యింది. “అతడు బాగోలేడు, పిచ్చివాడు కావచ్చు” అన్న అనుమానంతో వెంటనే పెళ్లిని రద్దు చేసింది. తనతో ఆ వ్యక్తిని పెళ్లి చేయలేనని తల్లిదండ్రులకు చెప్పింది. వరుడి కుటుంబం ఎంత నచ్చచెప్పినా వధువు ఒప్పలేదు.

ఇరు కుటుంబాలు చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాయి. అక్కడ పోలీసులు కూడా సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరిపారు. కానీ వధువు తన నిర్ణయాన్ని మార్చలేదు. దీంతో వరుడు తన కుటుంబంతో కలిసి గ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు.

వధువు తండ్రి, కట్నంగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వరుడి తండ్రి, పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు అయిందని వాదించారు. చివరకు ఎవ్వరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు వివాహానికి ముందు పరస్పర విశ్వాసం, ఆరోగ్యం, ప్రవర్తన వంటి విషయాలు ముందుగానే తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

वो पागल है, मैं शादी नहीं करूंगी: शादी के सिंदूर दान की रस्स के दौरान दूल्हा का हाथ हिल गया और इसके बाद लड़की ने शादी से इनकार कर दिया. लड़की ने कहा कि लड़का पागल है.#kaimur #Bihar #BiharNews pic.twitter.com/rCtE68R2VI

— FirstBiharJharkhand (@firstbiharnews) June 9, 2025
Get In Touch

© APTG360. All Rights Reserved.