Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Telugu Movie   »   కమల్ హాసన్ వివాదంపై స్పందన – ప్రేమకు క్షమాపణ అవసరం లేదు

కమల్ హాసన్ వివాదంపై స్పందన – ప్రేమకు క్షమాపణ అవసరం లేదు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. చెన్నైలో జరిగిన తన కొత్త సినిమా థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని అన్న విషయం కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది.

ఈ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప తీవ్రంగా స్పందిస్తూ, కమల్ హాసన్ తప్పు అంగీకరిచి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ స్పందించారు. “నేను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో అన్నవి. ప్రేమకి ఎప్పుడూ క్షమాపణ అవసరం ఉండదు. నా మాటల్లో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నేను చరిత్రకారుడిని కాదు. భాషల మూలాలపై తేల్చేది నిపుణులే. రాజకీయ నాయకులు (నాతో సహా) ఈ విషయాల్లో మాట్లాడే అర్హత కలవారు కారు” అని అన్నారు.

కమల్ మాట్లాడుతూ, “తమిళనాడు ఒక బహుళ సంస్కృతులు కలిగిన రాష్ట్రం. జయలలిత గారు మైసూరు సంస్థానానికి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. చెన్నైకి ఇబ్బందులు వచ్చినప్పుడు కర్ణాటక సహాయం చేసింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రేమే ఉండాలి,” అన్నారు.

కమల్ హాసన్ చేసిన వివరణతో వివాదం తగ్గుతుందా లేదా అన్నది చూడాలి కానీ, ఆయన మాటలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడమే స్పెషల్ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

Get In Touch

© APTG360. All Rights Reserved.