గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల విజేతలకు చిరంజీవి అభినందనలు
GaddarTelangana Awards 2024 విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కళా రంగానికి చెందిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వ గుర్తింపు చాలా విలువైనదని, ఇది మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషకరమని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత మంత్రులకు, అధికారులకు, మొత్తం బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.