జయం రవిపై మరో ఆరోపణ – “అతని వల్ల రూ.100 కోట్ల అప్పు చేశాను” అంటూ అత్త సుజాత
ప్రముఖ తమిళ హీరో జయం రవి కుటుంబంలో తలెత్తిన కలహం రోజు రోజుకు పెద్ద సమస్యగా మారుతోంది. ఆయన భార్య ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, రవిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రవి వల్లే నేను సినిమాల్లోకి నిర్మాతగా వచ్చినా, ఇప్పుడు అప్పుల ఊబిలో మునిగిపోతున్నా. కానీ ఆయన మాత్రం ఒంటరిగా నన్ను వదిలేశారు అని ఆమె చెప్పారు.
సుజాత తెలిపిన వివరాల ప్రకారం, రవి నటించిన ‘అడంగ మరు’, ‘భూమి’, ‘సైరన్’ అనే సినిమాల కోసం తాను రూ.100 కోట్ల వరకు అప్పు తీసుకున్నారని చెప్పారు. అందులో 25 శాతం పారితోషికం జయం రవికే ఇచ్చారని తెలిపారు. అయితే ఆర్థికంగా తాను ఇబ్బందుల్లో ఉన్నా, రవి మాత్రం తన బాధను పట్టించుకోలేదని ఆరోపించారు. ‘‘అతన్ని నేను అల్లుడిలా కాదు, కొడుకులా చూసాను. ఆయన ఇలా చేస్తాడనుకోలేదు తల్లిగా నాకు చాలా కలతగా ఉంది” అని ఆమె అన్నారు
ఇప్పటికే జయం రవి, ఆర్తి విడాకుల ప్రక్రియలో ఉన్నారు. గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు రవి ప్రకటించగా, ఆర్తి మాత్రం తనకు ఏ సమాచారం లేదని పేర్కొంది. ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. కాగా, ఇటీవల జయం రవి కూడా స్పందిస్తూ, ‘‘నేను నా భార్య, కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేశా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నా. పిల్లలు నా జీవితం’’ అని అన్నారు. అలాగే గాయని కెనీషా తనకు క్లిష్ట సమయంలో అండగా నిలిచిందని తెలిపారు.