Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Telugu Movie   »   నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ పై క్లారిటీ – జూలై 4నే థియేటర్లలోకి!

నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ పై క్లారిటీ – జూలై 4నే థియేటర్లలోకి!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’ తాజాగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ సప్తమి గౌడ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ‘తమ్ముడు’ సినిమా జూలై 4, 2025న విడుదల అవుతుందని ప్రకటించిన చిత్రబృందం, అదే తేదీన విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా కూడా రిలీజ్ కానుండటంతో నితిన్ సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ఆ అర్థాంతర వార్తలపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్.

అవును, ‘తమ్ముడు’ అనుకున్న తేదీకే విడుదల కానుంది, అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు జూన్ 11న సాయంత్రం సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సమాచారం సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు.

సినిమా రిలీజ్ తేదీపై వచ్చిన గందరగోళానికి పుల్‌స్టాప్ పడటంతో, ఇప్పుడు ఫ్యాన్స్ మూవీకి కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ట్రైలర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Banger From Thammudu Announcement | #ThammuduOnJuly4th | Nithiin | Sriram Venu | Raju – Shirish

Get In Touch

© APTG360. All Rights Reserved.