Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Telugu Movie   »   షైన్ టామ్ చాకోకు రోడ్డు ప్రమాదం – తండ్రి మృతి, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో

షైన్ టామ్ చాకోకు రోడ్డు ప్రమాదం – తండ్రి మృతి, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో

మలయాళం మరియు తెలుగు సినిమాల్లో నటిస్తున్న షైన్ టామ్ చాకోకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం ఉదయం తమిళనాడులో ధర్మపురి దగ్గర జరిగింది.

షైన్ టామ్ చాకో కుటుంబంతో కలిసి కారులో ఎర్నాకులం నుంచి బెంగళూరు వెళ్తున్నారు. ప్రయాణం మధ్యలో వారి కారు లారీని ఢీకొట్టింది. కారులో షైన్‌తో పాటు ఆయన తండ్రి, తల్లి, సోదరుడు ఉన్నారు. ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

షైన్ టామ్ చాకో ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. తల్లి, సోదరుడూ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంకా వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

షైన్ టామ్ చాకో ఇటీవల తెలుగు చిత్రాల్లో ‘దసరా’, ‘డాకూ మహారాజ్’, ‘దేవర’ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. కొద్ది నెలల క్రితం కేరళలో డ్రగ్స్ కేసులో పట్టుబడి, తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఈ ప్రమాద వార్త సినిమా ఇండస్ట్రీను విషాదంలో ముంచింది. అభిమానులు షైన్ టామ్ చాకో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Get In Touch

© APTG360. All Rights Reserved.