7/G బృందావన్ కాలనీ 2లో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా?
తెలుగులో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రేమ కథ చిత్రం 7/G బృందావన్ కాలనీ. ఈ సినిమా 2004లో విడుదలై, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెండో భాగం రూపొందుతోంది.
7/G బృందావన్ కాలనీ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా సెల్వ రాఘవన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది. మొషన్ పోస్టర్ కూడా విడుదలై మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న దానిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఇవానా, అదితి శంకర్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మలయాళ నటి అనస్వర రాజన్ పేరు ప్రచారంలో ఉంది. ఆమె “రేఖ” అనే మలయాళ సినిమా ద్వారా గుర్తింపు పొందింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు ఇప్పుడు ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.